ఇదేం రాజకీయం జగన్?
Sharmila question Jagan on Sakshi news
వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా దిగజారిపోతున్నారనే మాట పలువురు నోటి వెంట వినిపిస్తుంది. తల్లి, చెల్లి అని కూడా చూడకుండా రాజకీయాల్లో అంతకంతకు నీచ రాజకీయాలు చేస్తున్నారు. తన సొంత దినపత్రికలోనే చెల్లి షర్మిల పై నీచమైన రాతలు రాయిస్తున్నారు. సాక్షిలో వాటా ఇవ్వలేదు సరికదా.. అదే సాక్షిలో సొంత చెల్లిపై అడ్డమైన రాతలు రాసే వారిని ఆపకుండా, అన్న బాద్యతను మరిచి ప్రవర్తించడం ఒక్క జగన్ కే చెల్లుతుందేమో.
షర్మిల సొంత పార్టీ పెట్టడం,తర్వాత కాంగ్రెస్ లో చేరి తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారడమే కాదు, తన పరువును బజారున పడేస్తుంది. తాను చేసిన తప్పులను సైతం ఎత్తి చూపుతుంది అనే కారణంగా జగన్ సొంత పత్రిక ద్వారానే చెల్లెలిని ఎదుర్కొనేందుకు ఇలాంటి రాతలా రాసేది. కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిచంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు షర్మిల వెళ్లడంపై నవంబర్ 17న సాక్షి పత్రికలో బాబుతో చెట్టాపట్టాల్! అనే శీర్షికతో కథనం ప్రచురితం చేసింది సాక్షి. ఒక కుటుంబ వేడుకకు ముఖ్యమంత్రిని ఆహ్వానించడాన్ని వ్యక్తిగత సంబంధాలపై అనుచిత వ్యాఖ్యానాలు చేసేలా చిత్రీకరించడంపై షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
హుందాగా రాజకీయ విమర్శలు చేయాల్సిన చోట ఒక మహిళ వ్యక్తిగత గౌరవం, ప్రతిష్ఠను ప్రశ్నించేలా కథనాలు రావడం ఎంతవరకు సమంజసం, కుటుంబ ఆస్తుల వివాదంలో తనకు వాటా ఇవ్వలేదని ఆరోపిస్తున్న షర్మిలపై, అదే కుటుంబంతో సంబంధం ఉన్న మీడియా సంస్థలో ఇలాంటి కథనాలు రావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
జగన్ రాజకీయ ప్రస్థానంలో షర్మిల కీలక పాత్ర పోషించారు. తన అన్న కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, పాదయాత్రలు చేసి, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. కానీ అన్నగా జగన్ ఆబధ్యతను మరిచి చెల్లెలు షర్మిలను దిగజార్చే కుట్ర సొంత ఆపత్రిక ద్వారానే చెయ్యడం హాస్యాస్పదం.
సాక్షి పత్రిక ప్రారంభం, కుటుంబ వ్యాపారాల విషయంలో షర్మిలకు వాటా ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని షర్మిల గతంలో వెల్లడించారు. సాక్షి, భారతి సిమెంట్స్‌లో 60:40 నిష్పత్తిలో వాటాల పంపిణీకి జగన్ ప్రతిపాదించారని, అందులో 40 శాతం వాటా తనకు రావాల్సి ఉందని షర్మిల తన బహిరంగ లేఖలో ఆరోపించారు. అయితే, ఆ ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన వాటాలను బదిలీ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తనకు వాటా రావాల్సిన సంస్థగానే పేర్కొన్న సాక్షి, నేడు తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించడం ఈ వివాదంలో ప్రధాన వైరుధ్యంగా మారింది.
కుటుంబ, రాజకీయ విభేదాల కారణంగా నేడు ఇద్దరూ వేర్వేరు రాజకీయ మార్గాల్లో ఉన్నారు. రాజకీయంగా విభేదించినంత మాత్రాన సొంత చెల్లి వ్యక్తిగత గౌరవాన్ని ప్రశ్నించేలా కథనాలు రావడం, దానిని జగన్ ఖండించకపోవడం ఏమిటి అనేది అంతుబట్టని ప్రశ్న.
















































