కుమార్తె పెళ్లి వేడుకలను ప్రకటించిన షర్మిల
Sharmila Reddy
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అన్న జగన్ మోహన్ రెడ్డి తో తెగ తెంపులుచేసుకుని తెలంగాణాలో పార్టీ పెట్టి ఇక్కడ దానిని కాంగ్రెస్ లో కలిపేసి ఏపీకి పోయి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పార్టీ ని నడిపిస్తున్న షర్మిల గత ఏడాది కొడుకు రాజారెడ్డి పెళ్లి చేసింది. ఈ ఏడాది కుమార్తె పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చెయ్యడమే కాదు.. సోషల్ మీడియా వేదికగా కుమార్తె పెళ్లి వేడుకలను ప్రకటించింది.
నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిశుద్ధ వివాహ మహోత్సవం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం. ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం.
ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, అలాగే డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక శుభవార్తను దేవుడి ఆశీర్వాదంతో నాన్న ఘాట్ వేదికగా మీతో పంచుకోవడం అత్యంత ఆనందదాయకం.
కాబోయే నూతన వధూవరుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా, సుఖసంతోషాలతో సాగాలని, అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల తొలి వివాహ ఆహ్వాన పత్రికను నా కుటుంబ సభ్యులతో, మరియు రఘురామ్ తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని నాన్న YSR ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నాన్న దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ. ఆయన చూపిన సన్మార్గం వారికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం..అంటూ ట్వీట్ చేసింది.















































