ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: A twist in this week's voting

బిగ్ బాస్ 10 : ఈ వారం ఓటింగ్ లో ట్విస్ట్

Bigg Boss 10: A twist in this week's votingBigg Boss 10: A twist in this week's voting

 

బిగ్ బాస్ సీజన్ 10 మొదలై రెండు వారాలు పూర్తి కావొస్తుంది. కామనర్స్  vs సెలబ్రిటీస్ అన్నట్టుగా కాకుండా కామనర్స్, సెలబ్రిటీస్ ని కలిపి ఆడిస్తున్నాడు బిగ్ బాస్. మొదటి వారంలో ఇద్దరిని ఎలిమినేట్ చేసి పంపించేసి హౌస్ లోకి చరణ్ ని రీ ఎంట్రీ ఇప్పించడం పెద్దగా షాకివ్వలేదు. అంత చప్పగా చరణ్ రీ ఎంట్రీని బిగ్ బాస్ ప్లాన్ చేసాడు.

రీ ఎంట్రీ ఇచ్చాక చరణ్ 2.ఓ చూస్తారనేలా త్రిగుణ్ తో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో హౌస్ లో ఉన్న 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్‌లో కి వచ్చారు. అందులో షాలినీ, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రామ్ ప్రసాద్, ముఖేష్ గౌడ, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్ ఉన్నారు.

ఈ వారం ఓటింగ్ లో కామనర్ రోహిత్ కి త్రిగుణ్ కి మద్యన హోరాహోరీ ఫైట్ నడుస్తుంది. మొదటిరోజు నుంచే త్రిగుణ్ vs రోహిత్ అన్న రేంజ్ లో హౌస్ లో గొడవ జరుగుతుంది. దానితో ఇద్దరూ హైలెట్ అవుతున్నారు. అలాగే ఓటింగ్ లో ఈ ఇద్దరూ టాప్ పొజిషన్ లో ఉన్నారు. చాలా తక్కువ ఓట్ల తేడాతో రోహిత్, త్రిగుణ్ మధ్యన ఓటింగ్ నడుస్తుంది.

ఇక మూడో స్థానాల్లో సీరియల్ నటుడు ముఖేష్ గౌడ్ ఉంటె.. ఆటో రామ్‌ ప్రసాద్‌ నాలుగో స్థానంలో, దేబ్జానీ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక షాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్ తదుపరి స్థానాల్లో కొనసాగుతుంటే. వర్షిణి, కృష్ణుడు చివరి స్థానంలో కనిపిస్తున్నారు. అంటే హౌస్ లో సైలెంట్ గా కనిపిస్తున్న కృష్ణుడు ఈ వారం ఇంటికెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది. 
 

Bigg Boss 10