ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Stree Shakti Scheme Completes One Year

స్త్రీ శక్తి కి ఏడాది

Stree Shakti Scheme Completes One Year


కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఇలా ప్రతి విషయంలోనూ అర్హులకు లబ్ది చేకూరేలా సూపర్ సిక్స్ లోని పలు పథకాలను అమలు పరుస్తూ ప్రజల మనసులను గెలుచుకోవడంలో సఫలం అవుతుంది. రైతు బంధు, స్త్రీ శక్తి, దీపం పథకం ఇలా సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు పరుస్తుంది.

గత ఏడాది ఆగష్టు 15 న స్త్రీ శక్తి పథకం అంటే బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం కలిపించారు. గత ఏడాది ఈరోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించడమే కాదు మహిళలతో కలిసి ఉచిత బస్ లో ప్రయాణించారు.

స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించి ఈరోజు అంటే ఆగస్టు 15 కి ఏడాది పూర్తి కావడంతో పరేడ్ గ్రౌండ్స్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్సులో మహిళలతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి ప్రయాణించారు. అలాగే స్త్రీ శక్తి లబ్దిదారులకు తేనేటీ విందు ఇచ్చిన సీఎం చంద్రబాబు.. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖిగా మాట్లాడారు.

స్త్రీ శక్తి పథకం ప్రారంభించి నేటితో ఏడాది అయింది.. ఇప్పటి వరకు 87 కోట్ల ప్రయాణాలు జరిగాయి. రాబోయే రోజుల్లో అందరి ఆదాయం పెరగాలి.. అందరి ఆరోగ్యం బాగుండాలి. అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు.. దీన్ని నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.

CM Chandrababu To Travel By Bus Today As Stree Shakti Completes One Year