ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prabhas's fans are getting disappointed.

డిజప్పాయింట్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas's fans are getting disappointed.

 

ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీ నుంచి ఏదో ఒక అప్ డేట్ వదులుతారు మేకర్స్ అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆగస్టు 15 వచ్చేసింది. అయినా ఇప్పటివరకు ఫౌజీ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు.

ఇప్పటికే ఆగష్టు నుంచి దసరా కు, దసరా నుంచి డిసెంబర్ కి ఫౌజీ చిత్రం వాయిదాపడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు పాన్ ఇండియా మార్కెట్ లో చాలా ఉన్నాయి. అంతకు మించి నిర్మాతలు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ప్రభాస్ కూడా ఫౌజీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు, ఆయనకు సంబందించిన షూటింగ్ లేకపోయినా ఫౌజీ సెట్ లోనే ఉంటున్నారు. ఫౌజీ మిగతా షూటింగ్ ని మోనిటర్ చేస్తున్నారు అంటూ నిర్మాత రవిశంకర్ చెప్పారు. ఏది ఏమైనా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫౌజీ నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున అప్ డేట్ ఆశించి ప్రభాస్ ఫ్యాన్స్ భంగపడ్డారు. 

Prabhas fans