నాగ్ vs బాలయ్య లేదంటే చిరు vs బాలయ్య?
King100 vs Dada
డిసెంబర్ 24 న కింగ్ నాగార్జున vs నటసింహ బాలకృష్ణ మధ్యన ఫైట్ షురూ అయ్యింది. నాగార్జున #King 100 అలాగే బాలయ్య దాదా చిత్రాలు డిసెంబర్ 24 అంటూ మేకర్స్ ప్రకటించడము చూసాం. దానితో డిసెంబర్ 24 న క్రేజీ ఫైట్ ని ప్రేక్షకులు వీక్షించబోతున్నారు. నాగ్ vs బాలయ్య మధ్యన బాక్సాఫీసు వార్ అంటూ అందరూ ఇంట్రెస్టింగ్ గా ఫీలవుతున్నారు.
అయితే ఇప్పుడు డిసెంబర్ 24 న గనక దాదా రిలీజ్ కి లేట్ అయితే సంక్రాంతి 2027 కి దాదా వెళ్లొచ్చని అంటున్నారు. అప్పుడు అయితే అంటే సంక్రాంతికి గనక దాదా డేట్ మార్చుకుంటే అప్పుడు చిరు తో ఫైట్ కి సై అనాలి. చిరంజీవి విశ్వంభర లేదంటే కాకా ఏదో ఒకటి సంక్రాంతి బరిలో ఉంటాయి.
అప్పుడైతే చిరు vs బాలయ్య. అది కూడా రసవత్తర ఫైట్ అనే చెప్పాలి. దాదా ఎట్టి పరిస్తితుల్లోనూ డిసెంబర్ 24 కే రిలీజ్ అని మేకర్స్ పట్టుదలతో పని చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా డిసెంబర్ 16 కర్నూలులో అంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఏ చిన్న కారణంతో దాదా వాయిదా పడినా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.
















































