వృషకర్మ కన్నా రుక్మిణికే క్రేజెక్కువ!
Vrushakarma vs Alias Rukmini
డిసెంబర్ 4 వచ్చే శుక్రవారం విడుదలకు సిద్దమైన రెండు క్రేజీ సినిమాల్లో ఏ చిత్రానికి ఎక్కువ క్రేజ్ ఉంది, ఏ చిత్రానికి ఎక్కువ హైప్ ఉంది అనే విషయంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. డిసెంబర్ 4 న యంగ్ హీరోస్ నాగ చైతన్య, నితిన్ చిత్రాలు విడుదలకు సిద్ధమవడమే కాదు ప్రమోషన్స్ లోను పోటీ పడుతున్నాయి.
నాగ చైతన్య వృషకర్మ తో వస్తుంటే, నితిన్ అలియాస్ రుక్మిణి తో వస్తున్నాడు. రెండు చిత్రాలపై మంచి అంచనాలున్నాయి. డిఫ్రెంట్ జోనర్ లో తెరకెక్కిన రెండు చిత్రాల ట్రైలర్స్ విడుదలయ్యాక నాగ చైతన్య వృషాకర్మ చిత్ర ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించగా.. నితిన్ అలియాస్ రుక్మిణి ట్రైలర్ కి డీసెంట్ టాక్ కనిపించింది.
నాని నిర్మాతగా నితిన్ హీరోగా తెరకెక్కిన అలియాస్ రుక్మిణి కి సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. వృషకర్మకు కొన్ని కట్స్ కూడా ఇచ్చారు. కార్తీక్ దండు వృషకర్మ బ్లాక్ బస్టర్ అని చెబుతున్నాడు, మరోపక్క నితిన్ అలియాస్ రుక్మిణి పై హోప్స్ పెట్టుకున్నాడు. ప్రమోషన్స్ లో ఎవరికి వారే విభిన్నంగా సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు.
అయితే డిసెంబర్ 4 న బాక్సాఫీసు దగ్గర టఫ్ ఫైట్ ఉన్నా ఎక్కడో ఒకచోట రుక్మిణి పైనే ప్రేక్షకుల్లో అంచనాలు కనిపిస్తున్నాయి. చూద్దం విడుదలయ్యాక ఏ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో అనేది!
















































