ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Varshini gets eliminated

BB10: అబ్బా సాయిరాం.. వర్షిణి ఎలిమినేట్

Bigg Boss 10: Varshini gets eliminatedBigg Boss 10: Varshini gets eliminated


బిగ్ బాస్ సీజన్ 10 లో ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ఎదురు చూసిన బిగ్ బాస్ ఆడియన్స్ కి ఆ క్షణం వచ్చేసింది. వర్షిణి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయి హౌస్ ను వీడినట్లుగా తెలుస్తుంది. సీజన్ మొదలైన రెండో వారం నుంచే వారం వారం వర్షిణి ని ఎప్పుడు ఎలిమినేట్ చేద్దామా అని చాలామంది ఎదురు చూసారు.

వర్షిణి కి గేమ్ పై ఫోకస్ ఉండదు, టాస్క్ ఆడదు, అమన్ నుంచి కెప్టెన్సీ లాక్కుంది, ముఖేష్ కోసమే గేమ్ ఆడుతుంది, త్రిగుణ ఫ్రెండ్ షిప్ చేజార్చుకుంది. రోహిత్ వాళ్ళతో చేరి ఇష్టం వచ్చిన కామెంట్స్ చేసింది. ప్రతి వారం నాగార్జున వచ్చి వర్షిణి కి ఇన్ పుట్స్ ఇస్తూ పెంపర్ చెయ్యడం అన్ని ఆడియన్స్ కి చిరాకు తెప్పించాయి.

ఇక ఈవారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా టెంపర్ వంశి అలాగే వర్షిణి ఇద్దరూ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. వర్షిణి ఎలిమినేషన్ న్యూస్ బయటకు రాగానే ఆడియన్స్.. అబ్బా సాయిరాం ఎన్నాళ్లకు దయ చూపావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Varshini Eliminated from Bigg Boss season 10