విశ్వంభర మళ్ళీ వాయిదా!

Vishwambhara postponed again!Vishwambhara postponed again!


మెగాస్టార్ నటించిన కాకా, విశ్వంభర చిత్రాల విడుదల విషయంలో మెగా కన్ఫ్యూజన్ నడుస్తుంది. 2027 సంక్రాంతి కే విశ్వంభర, కాకా చిత్రాలు విడుదల చెయ్యాలని మేకర్స్ పట్టుపడడం మెగాస్టార్ కి తలనెప్పిగా తయారైంది. కాకా దర్శకుడు ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే రిలీజ్ అంటూ పట్టుబట్టడం..

విశ్వంభర సంక్రాంతి కి విడుదల చేస్తే సేవ్ అవుతుంది అనేది దర్శకుడు వసిష్ఠ, మేకర్స్ పట్టుదల. కానీ కాకా మేకర్స్ తగ్గడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు కాకా టీమ్ తో మీటింగ్ పెట్టారని.. కానీ కాకా మేకర్స్ మాత్రం తమ చిత్రాన్ని సంక్రాంతి కే విడుదల చేసేందుకు పట్టుబట్టడం తో విశ్వంభర విడుదల మళ్ళీ వాయిదా తప్పట్లేదు.

మరోసారి విశ్వంభర విడుదల విషయంలో సస్పెన్సు.. మళ్లీ మొదటికి వచ్చింది. విశ్వంభర మళ్లీ మళ్లీ వాయిదా తప్పట్లేదు, ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కి నిరాశ కలిగినా కాకా తో హ్యాపీనే.

What is really happening with Vishwambhara release?