బిగ్ బాస్: వర్షిణి కి వీడియోస్ వేసి మరీ క్లాస్
Bigg Boss 10 : Varshini vs Thrigun
బిగ్ బాస్ సీజన్ 10 మొదటి వారం నుంచి ఆడియన్స్ కి అస్సలు నచ్చని కంటెస్టెంట్ ఎవరైనా వున్నారు అంటే ఆమె వర్షిణి. సెలెబ్రిటీ గా హౌస్ లోకి వచ్చిన వర్షిణి గేమ్ ఆడదు, ఆడితే విమెన్ కార్డు తీస్తుంది. ముఖేష్ కోసం ఆడుతుంది, ముఖేష్ కోసం త్రిగుణ తో గొడవ పడుతుంది. త్రిగుణ చీప్ కేరెక్టర్ అన్నాడు అంటూ ప్రతి వారము సింపతీ డ్రామా ప్లే చేస్తుంది.
అసలు వర్షిణి ని ఎప్పుడు ఎలిమినేట్ చేద్దామా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, ఆమె డ్రామా ప్లే చేసినప్పుడు బుల్లితెర ఆడియన్స్ లో చిరాకు. కానీ బిగ్ బాస్ యాజమాన్యం ఆమెను కాపాడుతుంది. ముఖేష్ ట్రాక్ కోసం ఆమెను హౌస్ లో ఉంచారు. ఇక త్రిగుణ ని ఫ్యామిలీస్ అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ పోగుతుంటే అతన్ని ఎలాగైనా బ్యాడ్ చెయ్యాలని తన కేరెక్టర్ ని చీప్ కేరెక్టర్ అన్నాడు అంటూ డ్రామా స్టార్ట్ చేసింది.
వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రాగానే వర్షిణి ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి నీబాధ ఏమిటి వర్షిణి అంటే త్రిగుణ తనని చీప్ కేరెక్టర్ అన్నాడు అంది. దానితో ఎందుకు త్రిగుణ అన్నాడో వీడియో వేసి చూపించారు నాగార్జున, దానితో వర్షిణి తెల్లమొహం వేసింది. త్రిగుణ నీకు ఎక్స్ ప్లైన్ చేసాడు కదా అంటే లేదు అంది, ఆ వీడియో వేసి చూపించారు.
ఆతర్వాత త్రిగుణ ని కూడా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి వర్షిణి తో జరిగిన గొడవ విషయంలో ఆయనతో సారీ చెప్పించే ప్రయత్నం చేసిన ప్రోమో వదిలారు.
















































