తారకు కలిసొచ్చిన రెండో వారం
Aakasamlo Oka Tara enters second week
గత శుక్రవారం విడుదలైన దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార చిత్రానికి ఆడియన్స్ నుంచి ఇంకా క్రిటిక్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ పడింది. దుల్కర్ నటన, సాత్విక వీరవల్లి బ్యూటిఫుల్ లుక్స్ మరియు పెరఫార్మెన్స్, శృతి హాసన్ కేరెక్టర్, జీవి ప్రకాష్ BGM , పవన్ సాధినేని దర్శకత్వాన్ని పొగిడిన వారే కానీ పొగడని వారు లేరు.
మొదటి వారంలో ఆకాశంలో ఒక తార అద్భుతమైన కలెక్షన్స్ తీసుకురాగా ఇప్పుడు రెండో వారంలోను ఈ చిత్రానికి కలిసొచ్చింది. ఈ వారం విడుదలైన చిత్రాలేవీ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చెయ్యాలకపోయాయి భోగి, నాన్న కుట్టి, ఐ హేట్ మ్యారేజ్, డాడ్స్ లిటిల్ గర్ల్ ఇలా ఏ చిత్రము ప్రేక్షకులకు నచ్చలేదు.
దానితో రెండో వారంలోను ఆకాశంలో ఒక తార కి థియేటర్స్ లో కలిసొచ్చింది. అందులోను మౌత్ టాక్ ఈ చిత్రానికి ప్లస్ అవడము, గత రెండు రోజులుగా సక్సెస్ మీట్స్ తో సినిమాని టీమ్ ఇంకా ప్రమోట్ చెయ్యడం అన్ని ఆకాశంలో ఒక తారకు ప్లస్ అయ్యి మరిన్ని కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.
















































