ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Satvika veeravalli - Got 2 project after her debut

ఒక్క హిట్ పడితే వెంటపడతారు!

Satvika veeravalli - Got 2 project after her debutSatvika veeravalli - Got 2 project after her debut

 

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. పూజ హెగ్డే, రష్మికలు హవా కొనసాగినప్పుడు ఏ ప్రోబ్లెం రాలేదు. పూజ హెగ్డే డల్ అవడం, రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ కావడంతో స్టార్ హీరోలకు హీరోయిన్స్ కరువు వచ్చింది. శ్రీలీల ఆ టాప్ చైర్ అందుకుంటుంది అనుకుంటే.. ఆమె కు వరసగా ప్లాప్స్ వెంటాడాయి. అంతకుముందు కృతి శెట్టి పరిస్థితి కూడా అదే.

అందుకే హిట్ హీరోయిన్స్ వెంట టాలీవుడ్ ఇండస్ట్రీ పడుతుంది అనే దానికి మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ బోర్సే లే ఉదాహరణ. ప్రస్తుతం వీరి పేర్లు బాగా వినబడుతున్న సమయంలో ఆకాశంలో ఒక తార తో దూసుకొచ్చిన సాత్విక వీరవల్లి కి ఇప్పుడు టాలీవుడ్ లో వరస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

ఆకాశంలో ఒక తార చిత్రంలో కల్పన గా, అమ్ములుగా ఆమె పెరఫార్మెన్స్, అలాగే ఫ్రెష్ ఫేస్ అన్ని ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అందుకే ఆ చిత్రం విడుదల కాకముందే ఆమెకు నాగ చైతన్య 25 వ ప్రాజెక్ట్ లో అవకాశం వచ్చింది. అలాగే రామ్ చరణ్-సుకుమార్ కలయికలో మొదలవుతున్న చిత్రం కోసం లుక్ టెస్ట్ జరిగినట్లుగా టాక్ ఉంది.

మరి ఈ రెండు ప్రాజెక్ట్ తో పాటుగా సాత్విక వీరవల్లి పేరు మరిన్ని ప్రాజెక్ట్స్ లో వినిపించినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. ఒక్క హిట్ పడితే వాళ్ళ వెంటే టాలీవుడ్ పడుతుంది అనడానికి మరో ఉదాహరణ సాత్విక వీరవల్లినే.

Satvika veeravalli