కాకా తగ్గేదేలే - పక్కా క్లారిటీ
KAΑKA Is Not Backing Down
2027 సంక్రాంతికి మెగాస్టార్ నటించిన విశ్వంభర వస్తుందా, లేదంటే ముందు నుంచి చెబుతున్నట్టుగా కాకా నే రిలీజ్ అవుతుందా... ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి అయితే పక్కా రిలీజ్ ఉంటుంది. అది విశ్వంభర లేదా కాకా. ఆ విషయంలో క్లారిటీ రాక మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతుంటే మధ్యలో చిరు ఈ సమస్య పరిష్కరించాలి, ఆయన పెద్దరికానికే ఈ సమస్య పరిష్కారం ఓ సవాల్ అంటూ కామెంట్లు.
కాకా మేకర్స్ ని ఒప్పించి విశ్వంభర ను సంక్రాంతి కి దించాలని విశ్వంభర మేకర్స్ మెగాస్టార్ ని కోరుతున్నారు. కాకా దర్శకుడు, నిర్మాతలు అది ఒప్పుకోవడం లేదు. ఆ సమస్య అలా నడుస్తున్న సమయంలోనే కాకా డైలాగ్ రైటర్ కోనా వెంకట్ కాకా వర్కింగ్ స్టిల్ షేర్ చేస్తూ Our Aim, Our Focus and Our Target is very clear 💥“KAAKA on JAN 13th” It’s going to be a “MEGA PONGAL” కాకా జనవరి 13 పక్కా రిలీజ్ అంటూ ట్వీట్ చేసారు.
ఆ ట్వీట్ ని దర్శకుడు బాబీ కొల్లి రీ ట్వీట్ చేస్తూ.. 47 DAYS TO #KAAKA 😎This SANKRANTHI 2027🤙#KaakaOnJan13 అంటూ పోస్ట్ చేసారు. మరి ఈలెక్కన ఎవరు చెప్పినా కాకా జనవరి 13 నుంచి తగ్గేదేలే దానికి పక్కా క్లారిటీ ఇస్తున్నామనేగా దీనర్ధం. మరి ఈ లెక్కన విశ్వంభర మేకర్స్ పరిస్థితి ఏమిటో చూడాలి.















































