ఆదర్శ కుటుంబం ఓటీటీ టాక్
Aadarsha Kutumbam OTT Talk
త్రివిక్రమ్ దర్శకుడిగా విక్టరీ వెంకటేష్ తో చేసిన ఫస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం. ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు మొదలయ్యాయి. కానీ సినిమా విడుదల పలుమార్లు వాయిదా వేసుకుంటూ రీ షూట్స్ కి వెళ్లడంతో విడుదలకు ముందు సినిమాపై హైప్ తగ్గింది. విడుదలయ్యాక థియేటర్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది.
అసలు ఈ సినిమా త్రివిక్రమే తీసారా అని మట్లాడారు, సినిమాలో ఫన్ లేదు అన్నారు.. అదిరిపోయే డైలాగ్స్ లేవు అంటూ ఇలా ఆదర్శ కుటుంబం చిత్రాన్ని థియేటర్స్ లో వీక్షించిన వారు మాట్లాడారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆదర్శ కుటుంబాన్ని స్ట్రీమింగ్ చేస్తుంది.
ఈరోజు శుక్రవారమే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంటర్ అయ్యింది. ఓటీటీ లో ఆదర్శ కుటుంబాన్ని వీక్షించిన వారు.. ఈచిత్రాన్ని అలాగే దర్శకుడు త్రివిక్రమ్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ కాదు నాగవంశీ తీసాడేమో అనిపిస్తుంది, ఒకవేళ త్రివిక్రమ్ కనుక తీసుంటే.. ఇకనుండి ఒకప్పుడు అని పాత సీన్స్ వేసుకోవచ్చు ట్విట్టర్ లో, ఇన్స్టా లో.. BGM వింటుంటే సొంపుగా లేదు, ఒక్క సీన్ కూడా రియాలిటీకి దగ్గరగా లేదు, రౌడీలను చూస్తే సీరియస్ లేదు , డైలాగ్స్ వింటుంటే కామెడీగా కూడా లేదు... ఇదేం ఫ్యామిలీ ఎంటర్టైనర్ రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరి థియేటర్స్ లో కన్నా ఆదర్శ కుటుంబం చిత్రం ఓటీటీ లోకి వచ్చాకే ఎక్కువ ట్రోల్ అవుతుందేమో అనేది ఇంకా కాస్త వేచి చూస్తే కానీ క్లారిటీ రాదు.















































