డీప్‌ఫేక్‌లపై అనన్య పాండే ఆగ్రహం!
Ananya Panday has spoken about AI in the film industryఅనుమతి లేకుండా ఒకరి గుర్తింపును దుర్వినియోగం చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విధానాలపై కచ్చితంగా అడ్డుకట్ట వేయాలని నటి అనన్య పాండే గట్టిగా అభిప్రాయపడ్డారు. ఇటీవల పర్సనాలిటీ రైట్స్‌కు బాంబే హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించిన నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు. అభ్యంతరకర డీప్‌ఫేక్ చిత్రాలు, నకిలీ ఎండార్స్‌మెంట్లు, తన పేరుతో చలామణి అవుతున్న ఏఐ చాట్‌బాట్‌లపై న్యాయపోరాటానికి దిగారు. ఎవరి అనుమతి లేకుండా వారిని కించపరిచేలా లేదా తప్పుదోవ పట్టించేలా ఏఐని వాడినప్పుడు మనం కఠినంగా నిలబడాలని స్పష్టం చేశారు.
నిత్యజీవితంలో ఏఐ ఒక భాగమైపోయిందని, షూటింగ్ సెట్లలో సౌండ్ ఎడిటింగ్ వంటి సాంకేతిక పనులను ఇది వేగవంతం చేసిందని అనన్య అంగీకరించారు. గతంలో చిన్నపాటి శబ్దాల వల్ల పదేపదే రీటేక్‌లు తీసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఏఐ సాయంతో ఆ పనులు సులభంగా పూర్తవుతున్నాయని తెలిపారు. అయితే మనుషుల స్థానంలో ఏఐ వస్తుందన్న ఆలోచనే భయానకంగా ఉందని.. మానవ భావోద్వేగాలను ఏఐ ఎన్నటికీ అందుకోలేదని అభిప్రాయాన్ని పంచుకున్నారు. సాంకేతికత ఎంత ఎదిగినా, సృజనాత్మకతలోనూ, వ్యక్తిగత హక్కుల పరిరక్షణలోనూ మనిషి విలువే ముఖ్యమని ఆమె మాటలు తేటతెల్లం చేస్తున్నాయి.
సినిమా.. సిరీస్‌ల విషయానికొస్తే ఈ ఏడాది `చాంద్ మేరా దిల్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన అనన్య `కాల్ మీ బే` రెండో సీజన్‌లో బెల్ల చౌదరి పాత్రతో మళ్లీ కనిపించనున్నారు. కాలక్రమేణా తన పాత్రలో వచ్చే పరిణామాలు, ఎదుగుదలను ప్రేక్షకులు ఈ సీజన్‌లో చూస్తారని ఆసక్తి రేపారు.















































