బిగ్ బాస్ లో పాలిటిక్స్ కామెంట్స్ శివాజీ క్లారిటీ
Sivaji Slams Bigg Boss Contestants For Politicking
నటుడు అలీ నిర్వహిస్తున్న ఓ షో లో బిగ్ బాస్ బజ్ యాంకర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివాజీ బిగ్ బాస్ లో పాలిటిక్స్ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అయ్యాయి. అలీతో శివాజీ మట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ రాజకీయనాకుల వలే ప్రవర్తిస్తున్నారు. ఈ అమ్మాయిని ఉంచితే వాడి ఆట పోతుంది, అందుకే ఈ అమ్మాయిని నామినేట్ చెయ్యకూడదు అంటూ పోలిటికల్ నాయకుల్లా ఆలోచిస్తున్నారు అన్నారు.
కానీ అది వేరే అర్ధాలుగా వైరల్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో రాజకీయనాయకులు గేమ్ ఆడిస్తున్నారు అన్నట్టుగా ప్రొజెక్ట్ అవడంతో శివాజీ మరో మాజీ కంటెస్టెంట్ తేజ తో మట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ ని రాజకీయనాకులు నడిపించడం అనలేదు.. బిగ్ బాస్ లోని హౌస్ మేట్స్ రాజకీయనాయకులు వలె స్ట్రాటజీలు వేస్తున్నారు.
బిగ్ బాస్ యాజమాన్యం ఎవరిపట్ల పార్షియాలిటీ చూపించదు. అలా అనుకుంటే కామనర్ అయిన పల్లవి ప్రశాంత్ విన్ అవ్వడు, అగ్నిపరీక్ష ద్వారా వచ్ఛిన కళ్యాణ్ పడాల విన్ అవ్వడు. మనకి నచ్చిన కంటెస్టెంట్ బయటికొస్తే బాధ ఉంటుంది, అలా అని షో యాజమాన్యాన్ని తప్పు పట్టకూడదు అంటూ ఇండైరెక్ట్ గా రోహిత్ ఫ్యాన్స్ కి శివాజి చురకలు వేశారు.















































