దాదా సెట్ లో మంచు మనోజ్ కి ఇంజురీ!
Manchu Manoj commitment stuns Dada
నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ స్టేజ్ కి వచ్చేసింది. డిసెంబర్ మొదటి వారానికల్లా దాదా షూట్ కంప్లీట్ చెయ్యాలని దర్శకుడు పరుగులు పెడుతున్నాడు. ప్రస్తుతం దాదా క్లైమాక్స్ షూట్ జరుగుతుంది.
ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సి ఉంది. కానీ బాలయ్యకు కాకినాడ ఫోర్ట్ లో దాదా సెట్ లో జరిగిన గాయంతో రెండు నెలలు షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపంచబోతున్న మంచు మనోజ్ కి దాదా క్లైమాక్స్ షూటింగ్ లో స్వల్ప గాయాలు అయ్యాయని.. గాయం చిన్నది కావడంతో టీం రిలాక్స్ అయ్యి చిత్రీకరణను కొనసాగించారు అని తెలుస్తుంది..
మనోజ్ గాయం వలన ఎలాంటి గ్యాప్ తీసుకోకుండానే సినిమా అనుకున్న సమయానికి పూర్తి కావాలని కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొన్న బాలయ్య, నిన్న మనోజ్ ఇద్దరికి గాయాలైన సినిమాని అనుకున్న సమయానికే కంప్లీట్ చెయ్యాలనే తపనతో గాయాలను కూడా లెక్క చెయ్యకుండా షూట్ లో పాల్గొంటున్నారు.
















































