కెనడాలో రంభ ఫ్యామిలీతో ప్రభుదేవా!
Prabhu Deva with Rambha’s family in Canada!పాత జ్ఞాపకాలు.. పాత ఫ్రెండ్స్ కలిస్తే ఆ ఫీలింగే వేరు కదా. కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా ఇటీవల కెనడా వెళ్లినప్పుడు కో-స్టార్, క్లోజ్ ఫ్రెండ్ రంభను కలిశారు. కెనడాలోని రంభ ఇంట్లో జరిగిన కలయికలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుదేవా సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. ఇద్దరూ కలిసి పనిచేసిన రోజులను, పాత ముచ్చట్లను గుర్తు చేసుకుంటూ ఈ గెట్-టుగెదర్ను ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.
కలిసిన ఫోటోలను రంభ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఒకప్పుడు సౌత్ హిందీ సినిమాల్లో కలిసి సందడి చేసిన ఇద్దరిని చాలాకాలం తర్వాత ఇలా ఫ్యామిలీ మూడ్లో చూడటంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.
పెళ్లి తర్వాత కెనడాలో సెటిలైన రంభ ఇంట్లో జరిగిన ఈ చిన్నపాటి వేడుక ఫోటోలు ఇప్పుడిప్పుడే నెట్టింట తిరుగుతున్నాయి. సినిమాల బిజీలో ఉన్నా.. ఇలాంటి వ్యక్తిగత కలయికలు, పాత స్నేహితులతో గడిపే క్షణాలు తారలకు కాస్త రిలీఫ్ ఇస్తాయి. ప్రభుదేవా, రంభల తాజా ఫోటోలు చూసి నాటి రోజుల జ్ఞాపకాల్లో మునిగిపోతున్నారు నెటిజన్లు.
















































