సీన్ ఓటీటీ డేట్ లాక్
Scene OTT Release Details
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , మలయాళ హీరో నెస్లేన్ కలయికలో మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన సీన్ చిత్రం నవంబర్ 6 న విడుదలైంది. ఈ చిత్రానికి థియేటర్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. సినీవిమర్శకులకు ఓకే ఓకే అనిపించినా సీన్ చిత్రం కామన్ ఆడియన్స్ కి మాత్రం బాగా నచ్చేసింది.
కోలీవుడ్ లోను సీన్ చిత్రాన్ని తమిళ ఆడియన్స్ బాగా ఆదరించారు కాబట్టే ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్బులోకి వెళ్ళిపోయింది. దానితో సీన్ చిత్రంపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ కనిపించింది. ఇప్పుడు ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తి కావడంతో ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి మొదలయ్యింది.
తాజాగా సీన్ చిత్ర ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యింది. వచ్చే నెల అంటే డిసెంబర్ 4 నుంచి సూర్య సీన్ చిత్రాన్ని ఓటీటీ లో స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
















































