పారితోషికం పెంచేసిన కోలీవుడ్ స్టార్
Suriya Remuneration Hike After Hattrick Hits
ఈ ఏడాది మూడు చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పారితోషికం పెంచేశారనే వార్త కోలీవుడ్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ అలాగే సీన్ చిత్రాలతో సూర్య వరసగా రూ.200 కోట్ల క్లబ్బులోకి మూడుసార్లు అడుగుపెట్టి సన్సేషన్ సృష్టించారు.
కరుప్పు తో రూ.300 కోట్లు, విశ్వనాథ్ అండ్ సన్స్ రూ.250 కోట్లు, సీన్ చిత్రం రూ. 250 కోట్లు కొల్లగొట్టడంతో సూర్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో ఆయన పారితోషికానికి రెక్కలొచ్చాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ కి రూ.60 కోట్లు అందుకున్న సూర్య నెక్స్ట్ మూవీ కి పది కోట్లు పెంచేశారనే టాక్ వినిపిస్తుంది.
అంటే సూర్య నెక్స్ట్ మూవీ కి అక్షరాలా రూ.75 కోట్లు అందుకోబోతున్నారని సమాచారం. ప్రస్తుతం సూర్య పై క్రేజ్ ఆయనపై ఉన్న అంచనాలు మాములుగా లేవు. లో బడ్జెట్ తో తీసిన సీన్ చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టాయి. దానితో సూర్య నెక్స్ట్ పై అంచనాలు క్రియేట్ అవవడమే కాదు ఆయన రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగింది.
















































