22 ఏళ్ల క్రితం జాన్ అబ్రహంతో తెలుగు నటుడు!
A Telugu actor with John Abraham 22 years ago!తెలుగు నటుడు హర్షవర్ధన్ రాణే పంచుకున్న పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులోనూ 22 ఏళ్ల నాటి జాన్ అబ్రహం ఫోటో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరూ కలిసి నటిస్తున్న `ఫోర్స్ 3` పై ఉన్న ఆసక్తి ఒక్క పోస్ట్‌తో మరింత రెట్టింపు అయింది. అప్పట్లో హర్షవర్ధన్ లుక్ కూడా ఇప్పుడున్న దానికి పూర్తి భి న్నంగా ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొత్తగా వేయించుకున్న టాటూ ఫోటోతో పాటు.. 32 ఏళ్ల నాటి చిన్ననాటి ఫోటో, బీచ్‌లో నడుస్తున్న తాజా ఫోటోను కూడా జత చేశారు. ఆ టాటూపై ఉన్న మాటలతో పాటు, లోపలి స్వరాన్ని నమ్మాలంటూ రాసిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది.
భావ్ ధూలియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఫోర్స్ 3`లో జాన్ అబ్రహం, హర్షవర్ధన్ రాణేతో పాటు తాన్యా మాణిక్తల కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ యాక్షన్ ఫ్రాంచైజీ మూడో భాగాన్ని మార్చిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాత ఫోటోలో కలిసి కనిపించిన ఇద్దరు ఇప్పుడు స్క్రీన్‌పై ఎలాంటి కెమిస్ట్రీ పండిస్తారా అని సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.
మరోవైపు నిర్మాత దీపక్ ముకుత్ తనకు రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ హర్షవర్ధన్ ఆసక్తికర రిక్వెస్ట్ చేశారు.. `సనమ్ తేరీ కసమ్` రీ-రిలీజ్ కోసం గతంలో అభిమానులతో కలిసి ఆఫీస్ ముందు నిలబడినట్లే వచ్చే నెల తన పుట్టినరోజునాడు మళ్లీ వస్తానని చెప్పారు. ఈసారి మాత్రం `సనమ్ తేరీ కసమ్ 2`కు పచ్చజెండా ఊపాలని కోరారు.
















































