బిగ్ బాస్ 10: నీతూ మాస్టర్ అవుట్
Bigg Boss Telugu 10: Neethu Master Eliminated
బిగ్ బాస్ సీజన్ 10 లో ఈ వారం డిక్టేటర్ టాస్క్ లో త్రిగుణ టీమ్ గెలిచి అమన్ కెప్టెన్ అయ్యాడు. శనివారం ఎపిసోడ్ లో త్రిగుణ ని పొగుడుతూనే త్రిగుణ బిహేవియర్ ముఖ్యంగా అతని మాట జారుడు విషయంలో హోస్ట్ నాగార్జున క్లాస్ పీకారు. ఇక ముఖేష్ ఆట పై నాగార్జున కామెంట్స్ వైరల్ అయ్యాయి. వంశి అన్న కొన్ని మాటలపై నాగార్జున ఫైర్ అయ్యారు.
ఇక ఈ వారం హౌస్ లో ఉన్న నరేష్ తప్ప మిగతా హౌస్ మేట్స్ మొత్తం నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ వారం ఓటింగ్ లో ముఖేష్ నెంబర్ 1 పొజిషన్ లో ఉండగా.. త్రిగుణ కొద్దిపాటి తేడాతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో చాలామందిలో అనుమానాలున్నాయి. ఓటింగ్ లో వీక్ గా ఉండే వర్షిణి ని ఎలిమినేట్ అవ్వకుండా చాలా వారాలుగా బిగ్ బాస్ కాపాడుతున్నాడు.
అందుకే డేంజర్ జోన్ లో వర్షిణి ఉన్నా వేరే ఎవరో ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఈ వారం నామినేషన్స్ లో ఉన్న నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ ఫైర్ గా అడుగుపెట్టిన నీతూ మాస్టర్ రోహిత్ ని తమ్ముడిగా చేసుకుని చాలామందిని టార్గెట్ చేసారు.
త్రిగుణ తో గొడవ పెట్టుకుంది, టాస్క్ లో 100 శాతం ఇచ్చే నీతూ మాస్టర్ బయట ఓటింగ్ లో మొదటి నుంచి వీక్ గానే వుంది. దివాళి వీక్ లోను బోటం లైన్ లోకి వచ్చిన ఆమె ఎలాగో సేవ్ అయ్యింది. కానీ ఈ వారం మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయింది.
















































