ENE రిపీట్ కి స్పీడు బ్రేకులు
Speed breakers for ENE Repeat
నిన్న గురువారం నవంబర్ 19 న విడుదలైన ENE రిపీట్ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సీక్వెల్ గా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ENE రిపీట్ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేసింది. మొదటిరోజు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.
అభినవ్ గోమటం కామెడీ అదిరిపోయింది, స్టోరీ లేదు, కానీ ఫన్ ఉంది.. వివేక్ సాగర్ BGM వేరే లెవల్, అంటూ ENE రిపీట్ చూసిన వారంతా పోజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అయితే ENE రిపీట్ కి ఈరోజు శుక్రవారం విడుదలవుతున్న దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార, ధనుష్ ఓం చిత్రాలు అడ్డుపడకపోతే అదిరిపోయే కలెక్షన్స్ వెనకేసుకునేది.
కానీ దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార, ధనుష్ ఓం చిత్రాలు ENE రిపీట్ కి స్పీడు బ్రేకర్స్ లా అడ్డుపడుతున్నాయి. ఆ రెండు చిత్రాలకు బెటర్ టాక్ వస్తే.. ఆకాశంలో ఒక తార, ఓం చిత్రాలు మధ్యలో ENE రిపీట్ నలిగిపోతుంది. లేదంటే అదిరిపోయే కాదు కాదు షాకిచ్చే కలెక్షన్స్ ENE రిపీట్ ఖాతాలో పడడం ఖాయం. చూద్దాం ఏం జరుగుతుందో అనేది.
















































