ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vedaant Madhavan among record-breakers at Ohio State Invitational

దేశం గర్వించేలా రాణించిన హీరో తనయుడు!

Vedaant Madhavan among record-breakers at Ohio State InvitationalVedaant Madhavan among record-breakers at Ohio State Invitational

ఆర్. మాధవన్  తనయుడు వేదాంత్ మాధవన్  స్విమ్మింగ్ రంగంలో మరో అరుదైన రికార్డును నెలకొల్పారు. అమెరికాలో జరిగిన ఒహియో స్టేట్ ఇన్విటేషనల్ పోటీల్లో 800-యార్డ్ ఫ్రీస్టైల్ రిలే విభాగంలో వేదాంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ కొత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో  కుమారుడు చూపుతున్న ప్రతిభ పట్ల మాధవన్ ఆనందం వ్యక్తం చేసారు.

గత కొంతకాలంగా స్విమ్మింగ్‌లో వరుస పతకాలు, రికార్డులతో దూసుకుపోతున్న వేదాంత్ ఇప్పుడు యూనివర్సిటీ రికార్డు బద్దలు కొట్టడంలో కీలక పాత్ర పోషించడం క్రీడా వర్గాల్లో.. సినీ అభిమానుల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది. కొడుకు క్రీడా ప్రయాణంలో వెన్నంటి నిలుస్తూ  సాధించిన విజయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే మాధవన్  తాజా మైలురాయితో మరోసారి తండ్రిగా పొంగిపోతున్నారు.

ఒకవైపు సినిమాల్లో భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు కుమారుడిని అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలబెట్టిన తీరు  స్ఫూర్తిగా నిలుస్తోంది. వేదాంత్  భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
 

R Madhavan’s son Vedaant Madhavan sets new West Virginia University