ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Saif Ali Khan gets death threat, police probe underway

సైఫ్ అలీ ఖాన్ కి బెదిరింపులు

Saif Ali Khan gets death threat, police probe underwaySaif Ali Khan gets death threat, police probe underway


ఈమధ్యన ముంబై సెలబ్రిటీస్ కి బెదిరింపులు ఎక్కువైయ్యాయి. కాదు కాదు షూటౌట్స్ కూడా భయపెడుతున్నాయి. సల్మాన్ ఖాన్ టార్గెట్ గా టైగర్ ష్రాఫ్ పై జరిగిన కాపుల్లో టైగర్ ష్రాఫ్ డ్రైవర్ కి అలాగే టైగర్ ష్రాఫ్ కి గాయాలయ్యాయి. ఆతర్వాత అమితాబ్ కి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి

తాజాగా బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ కి  గుర్తుతెలియని వ్యక్తుల నుంచి హత్య చేస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సైఫ్ అలీ ఖాన్ ను కూడా బాబా సిద్ధిఖీ తరహాలోనే హత్య చేస్తామంటూ జీషన్ అక్తర్ పేరిట సైఫ్ కి ఒక బెదిరింపు వాయిస్ మెసేజ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

గతంలో బాలీవుడ్ నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. ఇప్పడు సైఫ్ కి వస్తున్న బెదిరింపులు ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక ముంబై పోలీసులు కూడా సెలబ్రిటీస్ కి వార్నింగ్ ఇస్తున్నారు, పబ్లిక్ ఈవెంట్స్ కి అలాగే ఫ్యాన్స్ కి దూరంగా ఉండమని చెబుతున్నారు. 

Saif Ali Khan latest Bollywood star to receive death threat