అత్తగా ఆనందపడుతున్న అమల అక్కినేని
Amala reflected on her role as a mother-in-law
అక్కినేని అమల అత్తగారిగా చాలా ఆనందపడుతున్నట్టుగా ఓ ఈవెంట్ లో చెప్పడం వైరల్ అవుతుంది. నాగ చైతన్య హీరోయిన్ శోభిత ని వివాహం చేసుకున్నాడు. గత ఏడాది అఖిల్ కూడా తాను ప్రేమించిన జైనబ్ ని వివాహం చేసుకోవడంతో నాగార్జున బ్యాక్ టు బ్యాక్ మామగారిగా మారిపోయారు.
శోభిత కెరీర్ పరంగా చెన్నై హైదరాబాద్ అంటూ తిరగడంతో.. చైతు హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఇక అఖిల్, జైనాబ్ లు తల్లితండ్రులతో కలిసి హ్యాపీగా ఉంటున్నారు. తాజాగా అమల తన కోడళ్ల తో తనకు ఉన్న బాండింగ్ పై స్పందించారు. ఇంట్లో అమ్మాయిలు తిరగడం బావుంటుంది. శోభిత, జైనాబ్ లు ఇంట్లో అడుగుపెట్టేవరకు ఇంట్లో మగవాళ్లే ఉండేవారు. ఇప్పుడు నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అత్తగా ఉండటం చాలా ఆనందంగా ఉంది.. అంటూ చెప్పిన అమల..
చైతు భార్య శోభిత చాలా ఆప్యాయంగా ఉంటుంది. శోభిత అందరితో బాగా కలిసిపోతుంది. అఖిల్ భార్య జైనబ్ తో నాకు ఇంకాస్త అనుబంధం ఉంది. ఎదుకంటే అఖిల్ ఆమెతో ప్రేమలో ఉన్నప్పుడే నేను కలిశాను. అప్పటి నుంచే జైనాబ్ ఎంతో నచ్చింది. చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉంటుంది. సొంత కూతురిలా నాకు అనిపిస్తుంది.
జైనాబ్ అయితే తనకంటే ఎక్కువగా నా గురించి శ్రద్ధ తీసుకుంటుంది. నాగార్జునను కూడా ఎంతో బాగా చూసుకుంటుంది. మేము పండుగలను సింపుల్ గా చేసుకునేవాళ్లం, కానీ జైనబ్ వచ్చిన తర్వాత ప్రతి వేడుకనూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం, అదే జైనాబ్ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది.
















































