ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> An AI mantra to overcome creative block!

క్రియేటివ్ బ్లాక్‌ను దాటేందుకు AI మంత్రం!

An AI mantra to overcome creative block!An AI mantra to overcome creative block!

సంగీత రంగంలో కృత్రిమ మేధస్సు  పాత్ర రోజురోజుకూ పెరుగుతోందని.. భవిష్యత్తులో మ్యూజిక్ ఇండస్ట్రీని ఏఐ పూర్తిగా శాసిస్తుందని  సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీ  ప్రయోగాత్మకంగా మాత్రమే కాకుండా వాస్తవ సృష్టిలోనూ ఎంతో ఉపయోగ పడుతోందన్నారు. రజినీకాంత్ న‌టించిన `కూలీ` సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో  ఎదురైన  సృజనాత్మక అవరోధాన్ని అధిగమించడానికి ఏఐ ఎలా సహాయపడిందో  పంచుకున్నారు.

`కూలీ` చిత్రంలోని ఒక పాట చివరి కొన్ని చరణాలు రాయడంలో ఇబ్బంది పడుతున్న సమయంలో తాను చాట్‌జీపీటీ  సహాయం తీసుకున్నట్లు అనిరుధ్ వెల్లడించారు. ఆ పాట పరిస్థితిని వివరించి కొన్ని సూచనలు కోరగా, టూల్ అందించిన చిన్న ఐడియా తనను ముందుకు నడిపించిందని ఆ పాటను విజయవంతంగా పూర్తి చేయడానికి దోహదపడిందన్నారు. ఏ సంగీత దర్శకునికైనా ఇలాంటి అడ్డంకులు సహజమని..సరిగ్గా తోచని సమయంలో ఏఐ వంటి ఆధునిక సాధనాలు కొత్త దిశను చూపించి ఎక్కువ సమయం వృధా కాకుండా కాపాడతాయని  అభి ప్రాయపడ్డారు.

ఇంతకుముందు `వేట్టైయాన్` చిత్రంలో దివంగత గాయకుడు మలేషియా వాసుదేవన్ గళాన్ని ఏఐ సాంకేతికత ద్వారా తిరిగి సృష్టించడాన్నిఉదాహరణగా పేర్కొన్నారు. ఒకే లైన్‌ను రికార్డ్ చేసి దానిని వివిధ పిచ్‌లు మార్చుకుంటూ బహుళ గాయనీమణులు పాడినట్లుగా టెక్నాలజీ ద్వారా మలచవచ్చని తెలిపారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును చూస్తుంటే రాబోయే రోజుల్లో సంగీత నిర్మాణ ప్రక్రియలో ఏఐ అనివార్య భాగం కానుందని అనిరుధ్ బలంగా నమ్ముతున్నారు.

AI offers that by providing new angles and perspectives