ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mouli's Crime Comedy Enters Profit Zone

డివైడ్ టాక్ తో ప్రాఫిట్స్ ఎలా?

Mouli's Crime Comedy Enters Profit ZoneMouli's Crime Comedy Enters Profit Zone


లిటిల్ హార్ట్స్ చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న మౌళి.. రెండో చిత్రానికి దొంగ నా కొడకా అంటూ కాస్త బోల్డ్ టైటిల్ తోనే ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యాలనుకున్నాడు. కానీ సెన్సార్ ఊరుకోలేదు. దానితో DNK అంటూ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పెద్ద బ్యానర్ లో తెరకెక్కడంతో సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించింది.

మౌళి కూడా చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. కానీ DNK విడుదలయ్యాక ఆ చిత్రానికి క్రిటిక్స్ నుంచి అలాగే ఆడియన్స్ నుంచి కూడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. క్రిటిక్స్ పూర్ రివ్యూస్ ఇచ్చారు. కానీ ఈసినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసిసేసరికి డిస్ట్రిబ్యూటర్స్ లాభాల బాట పట్టారు.

అసలు డివైడ్ టాక్ వచ్చిన ఈ సినిమాకి వారాంతానికే ప్రాఫిట్స్ ఎలా అంటూ చాలామంది అనుమానపడుతున్నారు. అయితే మౌళి DNK చాలా తక్కువ బడ్జెట్ అంటే నిర్మాణ ఖర్చుల కోసం రూ.6 కోట్ల లోపే పెట్టినట్లుగా చెబుతున్నారు. అది థియేట్రికల్ రైట్స్ ద్వారానే వచ్చేశాయని..

ఇప్పుడు మొదటి వారాంతానికే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అలా DNK డివైడ్ టాక్ తోనే బయ్యర్లు బయటపడిపోవడమే కాదు.. నిర్మాణ సంస్థకు ఇపుడు ప్రాఫిట్స్ వస్తున్నాయి. తక్కువ బడ్జెట్, మంచి లాభాలు మౌళి దొంగ నా కొడుకు తెచ్చిపెట్టింది. 

Mouli's film DNK enters the profit zone