ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tiger Shroff has completed the Pune shooting schedule

భయాన్ని వీడి సెట్స్‌లో హీరో!

Tiger Shroff has completed the Pune shooting schedule Tiger Shroff has completed the Pune shooting schedule

 

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల కలకలం ఘటన నుంచి తేరుకుని తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. రాజ్‌ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `లగ్ జా గలే` చిత్ర షూటింగ్‌లో మ‌ళ్లీ పాల్గొనడం ప్రారంభించారు. ఇటీవల జరిగిన ఊహించని భద్రతా సంఘటన కారణంగా కొద్దిరోజులు షూటింగ్‌కు దూరంగా ఉన్న టైగర్ పూణేలో జరగాల్సిన షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

కొన్ని వారాల క్రితం టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై  దుండగులు కాల్పులు జరపడం బాలీవుడ్‌లో  సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ కారు అద్దాలు పగిలిపోవడం .. గన్‌పౌడర్ కారణంగా  స్వల్ప గాయాలయ్యాయి. ఈ పరిణామంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ భయాలన్నింటిని పక్కన పెట్టి సినిమా పట్ల అంకితభావాన్ని చాటుకుంటూ టైగర్ మళ్లీ కెమెరా ముందుకొచ్చారు.

పూణే షెడ్యూల్ పూర్తి కావడంతో  యూనిట్ సోషల్ మీడియా వేదికగా  విషయాన్ని అధికారికంగా పంచుకుంది. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన జాన్వీ కపూర్  కథానాయికగా నటిస్తుండగా.. లక్ష్య మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. పూణే షెడ్యూల్ ముగింపు సందర్భంగా మేకప్.. హెయిర్ ఆర్టిస్ట్ సౌరవ్ రాయ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో `ఎల్‌జేజీ పూణే రాప్`  ట్యాగ్‌తో చాక్లెట్ కేక్ ఫోటోను షేర్ చేశారు.

Tiger Shroff