ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sekhar Master Sustains Minor Injuries In Car Accident

రోడ్డు ప్రమాదంలో శేఖర్‌ మాస్టర్ కు గాయాలు..!

Sekhar Master Sustains Minor Injuries In Car Accident Sekhar Master Sustains Minor Injuries In Car Accident


కొద్దినెలల క్రితం ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ కి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో పండు మాస్టర్ కాళ్ళు రెండు చాలా డ్యామేజ్ అయ్యాయి. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ మండలం ముచ్చింతల్ వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ గాయాలపాలయ్యారు.

ఈ ప్రమాదంలో డాన్స్ మాస్టర్ శేఖర్‌కు స్వల్పగాయాలు. మహేశ్వరం మండలం గొల్లూరు వద్ద మెగాస్టార్ చిరంజీవి-బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాక షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రమాదంలో 2 కార్లు బాగా దెబ్బతిన్నాయి.

అయితే ఈ యాక్సిడెంట్ లో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు చెబుతున్నారు. శేఖర్ మాస్టర్ కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని తెలుస్తుంది. 

Sekhar Master Sustains Minor Injuries In Car Accident At Shamshabad