YSRCP కార్యకర్తను కొట్టిన రోజా
Roja Slaps YSRCP Party Worker
చిత్తూరు మున్సిపల్ ఎన్నికలపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర విమర్శలు చేస్తూ కారులో ఆందోళన చేస్తున్న క్రమంలో ఆమె అస్వస్థతకు గురవుతుంది అన్న ఆందోళనతో కారులో ఉన్న YSRCP కార్యకర్త రోజాకు వాటర్ బాటిల్ తో నీళ్లు ఇస్తున్న క్రమంలో ఆ వాటర్ బాటిల్ ని విసిరేసి ఆ కార్యకర్తను రోజా కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.
ఈరోజు శనివారం ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. చాలా చోట్ల టీడీపీ, కూటమి అభ్యర్థులు విజయాన్ని సాధిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద రచ్చ చేస్తూ అన్యాయం జరిగింది అంటూ రెచ్చిపోతున్నారు.
కొంతమంది వైసీపీ నేతలు ఆ ఫ్రస్ట్రేషన్ ను సొంత పార్టీ కార్యకర్తలు, అనుచరులపై చూపించడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చిత్తూరు జిల్లా ఇలత్తూరు ఎంపీటీసీ ఫలితంపై నగరి మాజీ మంత్రి RK రోజా అసహనం వ్యక్తం చేస్తూ కారులోనే కూర్చుని తమ నిరసన తెలుపుతున్న క్రమంలో ఆమె ఉద్రేకపడుతున్న సమయంలో కారు లోనే ఉన్న వైసీపీ కార్యకర్త గబగబా వాటర్ బాటిల్ తీసి ఇవ్వగా రోజా విసురుగా ఆ బాటిల్ విసిరేసి ఆ కార్యకర్తపై చేయి చేసుకుంది. ఇప్పుడా వీడియో వైరల్ అవడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
















































