రిలీజ్ ఈవెంట్ మాత్రమేనా? సినిమా కూడా పోస్ట్ పోనా?
Bhogi Pre Release Event Postponed
సంపత్ నంది దర్శకుడిగా శర్వానంద్ హీరోహా తెరకెక్కుతున్న భోగి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రెస్ నోట్ విడుదల చేసింది. నవంబర్ 12 న సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈరోజు నవంబర్ 7 న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చివరి నిమిషంలో మేకర్స్ పోస్ట్ పోన్ చేసారు.
అయితే సినిమాపై మంచి అంచనాలున్నాయి. శర్వానంద్ వరసగా సక్సెస్ లతో ఉన్నారు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చివరి నిమిషంలో వాయిదా వెయ్యడంతో.. సినిమా కూడా నవంబర్ 12 న విడుదల ఉంటుందా, లేదంటే భోగి రిలీజ్ వాయిదా వేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న భోగి చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తిని, ట్రేడ్ లో అంచనాలను క్రియేట్ చేసింది. ఇలాంటి సమయంలో సినిమా వాయిదా అంటే ఎలా అని శర్వా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే సినిమా విడుదల వాయిదా విషయంలో ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
















































