శ్రీరాముని వనవాసం 14 ఏళ్లే..నా వనవాసం ఇంకెన్నాళ్లు?
Renu Desai on hate after divorce with Pawan Kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడుస్తున్నా? ఇప్పటికీ ప్రతి చిన్న విషయానికి ఆయనతోనే ముడిపెట్టి మాట్లాడటంపై నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న రేణు వ్యక్తిగత జీవితం - సమాజం తనను చూసే తీరుపై చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీరాముడి వనవాసాన్ని ఉదాహరణగా చూపిస్తూ మనసులోని బాధను వెళ్లగక్కారు.
`తెలుగు ప్రజల దృష్టిలో నాకు జూన్ 1999 (బద్రి సినిమా సమయం) కంటే ముందు అసలు జీవితమే లేనట్లు భావిస్తారు. విడాకులు జరిగి 14 ఏళ్లు దాటిపోయింది. శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం చేశాడు.. కానీ పవన్ కళ్యాణ్‌తో నన్ను ముడిపెట్టే ఈ సమాజపు ఆలోచనా వైఖరి అనే 'వనవాసం' ఇంకెప్పుడు ముగుస్తుంది? అని ఆమె నేరుగా ప్రశ్నించారు. 2012లో పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత తాను సాధించిన సొంత గుర్తింపును ఎవరూ గుర్తించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విడాకుల అనంతరం తాను మరాఠీలో ఓ సూపర్ హిట్ సినిమాను నిర్మించానని.. మరో ప్రాజెక్ట్‌కి రచయిత్రిగా, దర్శకురాలిగా .. నిర్మాతగా వ్యవహరించానని గుర్తుచేశారు.
డ్యాన్స్ రియాలిటీ షోలు, కవితా సంపుటాలు , ఎన్నో సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేశానని స్పష్టం చేశారు.సినీ రంగానికే పరిమితం కాకుండా వీధి కుక్కలు, పెంపుడు జంతువుల సంరక్షణ కోసం ఎన్‌జీఓ నడుపుతూ వైద్య సహాయం అందిస్తున్నానని రేణు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో కొందరు తనను అత్యంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. `ఆయన (పవన్) లేకపోతే ఆమెకు బ్రతకడమే అనవసరం` అనేలా కొందరు కామెంట్లు చేస్తూ వ్యక్తిత్వాన్ని హేళన చేస్తున్నారని ఆవేదన నిండిన గొంతుతో వెల్లడించారు.
















































