ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akkineni Trio in an Episode of MegaVerse

బాలయ్య కి నో.. చిరు కి ఓకే చెప్పిన నాగ్

Akkineni Trio in an Episode of MegaVerseAkkineni Trio in an Episode of MegaVerse

 

నందమూరి బాలకృష్ణ మొదటిసారి చేసిన ఆహా టాక్ షో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆహా ఓటీటీ కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అంటూ సెలెబ్రిటీ టాక్ షో చాలా బాగా సక్సెస్ అయ్యింది. బాలయ్య టాక్ షో అనగానే చాలామంది ఆశ్చర్యపోయినా.. ఆయన టాక్ షోకి చాలామంది అభిమానులయ్యారు.

అయితే బాలయ్య మూడు సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా నడిపినప్పటికీ ఏ సీజన్ లోకి మెగాస్టార్ చిరు కానీ, అలాగే నాగార్జున కానీ గెస్ట్ గా రాలేదు. చిరంజీవి బాలయ్య షో కి వస్తున్నారు, అదిగో ఇదిగో అన్నారు కానీ అన్ స్టాపబుల్ కి మెగాస్టార్ రాకుండానే ఎండ్ కార్డు పడింది. అక్కినేని ఫ్యామిలీ కూడా కనిపించలేదు. మరి నాగ్ కి బాలయ్య కి అంతగా తత్సంబందాలు ఉండవు, ఇద్దరి నడుమ కోల్డ్ వార్ అనేది ఓపెన్ సీక్రెట్.

అయితే బాలయ్య షో కి అరవింద్ నాగ్ ని పిలిచినా ఒప్పుకోలేదో, లేదంటే పిలవలేదో తెలియదు కానీ.. నాగార్జున మెగాస్టార్ చిరు ఓటీటీ డెబ్యూ ఇస్తూ నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న సెలెబ్రిటీ టాక్ షో మెగావర్స్ కి రావడం అక్కినేని అభిమానులు ఎగ్జైట్ అయ్యేలా చేసింది. చిరు మొదటిసారి ఓటీటీ కోసం చేస్తున్న మెగావర్స్ కి నాగార్జున, చైతు, అఖిల్ గెస్ట్ లుగా హాజరయ్యారు.

రీసెంట్ గానే ఆ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయ్యింది. మరి చిరంజీవి, నాగార్జున మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు వీరి మద్యన జరిగిన ఎపిసోడ్ లో ఎలాంటి సీక్రెట్స్ బయటికి వస్తాయో, నాగ్ తో చిరు ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పించారో అనేది ఇంట్రెస్ట్ గా మారింది. 

Chiranjeevis Megaverse talk show on Netflix