నయనతార కు హ్యాట్రిక్ షాకులు
Mahasakthi Public talk
ఈ ఏడాది లేడీ సూపర్ స్టార్ నయనతారకు హ్యాట్రిక్ షాకులు తగిలాయి. టాక్సిక్ చిత్రంలో కీ రోల్ కీ రోల్ అంటూ నయనతారను ముంచేశారు. గీతూ మోహన్ దాస్ చెప్పింది, యశ్ మంచోడు అని ఆ సినిమాని నయనతార ఒప్పుకుంది, కానీ టాక్సిక్ షాక్ నయనతార కు మాములుగా తగల్లేదు.
ఆతర్వాత సింపుల్ గా హాయ్ అంటూ వచ్చింది. ఆ చిత్రం కూడా నయనతారను బాగా డిజప్పాయింట్ చేసింది. తాజాగా ఈ ఏడాది మూడో సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార మహాశక్తి ఘోరమైన రిజల్ట్ ని మూటగట్టుకుంది. తెలుగులో అయితే మహాశక్తి కి డిజాస్టర్ రివ్యూస్ వచ్చాయి. ప్రేక్షకులు పెదవి విరిచారు.
కోలీవుడ్ లో సుందర్ సి తెరకెక్కించిన మూకుతి అమ్మన్ 2 చిత్రం తెలుగులో మహాశక్తి గా విడుదలైంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా నయనతార ఉంది కదా.. తెలుగులో వర్కౌట్ అవుతుంది, ప్రేక్షకులు వచ్చేస్తారు అనుకున్నారో ఏమో.. ఇక్కడ డబ్ చేసి సైలెంట్ గా విడుదల చేసేసారు.
ఆ చిత్రం ఎప్పుడు, ఎందుకు రిలీజ్ అయ్యిందో కూడా ఆడియన్స్ కి అర్ధం కాలేదు. అంతేకాదు.. ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఘోరంగా ఉంది, ఈ చిత్రాన్ని నయనతార ఎలా ఒప్పుకుందో అంటూ మాట్లాడుతున్నారు. మరి ఈ ఏడాది టాక్సిక్, హాయ్, మహాశక్తి ఈ మూడు చిత్రాలతో ప్లాప్ అందుకుని హ్యాట్రిక్ ప్లాప్ లను ఖాతాలో వేసుకుంది నయన్.
















































