RC17: చరణ్, సుక్కు కి కళ్ళు చెదిరే పారితోషికం
RC17: Big Remunerations for Ram Charan and Sukumar
రామ్ చరణ్-సుకుమార్ కాంబో లో రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలైన RC17 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలు కానున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని RC17 చిత్రానికి సంబందించిన నటుల ఎంపిక చేయాల్సివుంది.
RC17 లో చరణ్ సరసన చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపంచాయి. సారా అర్జున్, రుక్మిణి వసంత్ ఇలా చాలామంది పేర్లు వినిపించినా.. RC17లో చరణ్ సరసన ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీస్ దాదాపుగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.
ఈ చిత్రానికి రామ్ చరణ్ అలాగే సుకుమార్ లు కళ్ళు చెదిరే పారితోషికం అందుకోబోతున్నట్లుగా సమాచారం. రామ్ చరణ్ ఈ చిత్రానికి పారితోషికంగా రూ.150 కోట్లు అందుకోనున్నారు. అలాగే దర్శకుడు సుకుమార్.. సుకుమార్ రైటింగ్స్ ద్వారా వచ్చే లాభాలతో కలిపి రూ.100 కోట్లు వసూలు చేస్తున్నారు అని తెలుస్తుంది.
















































