రామాయణ ప్రీమియర్స్ టాక్

Ramayana Premieres TalkRamayana Premieres Talk


బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వం వహించి, భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా, యష్, చార్లెస్ రోవన్క్ తెరకెక్కించిన రామాయణ నేడు నవంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణ ప్రీమియర్స్ అంటూ వారం క్రితమే యుఎస్ లో టీమ్ హడావిడి చేసింది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రావణుడిగా యాష్ నటించిన ఈ చిత్రం పై ఆడియన్స్ లోను ట్రేడ్ లోను విపరీతమైన అంచనాలున్నాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామాయణ ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే...

రావణుడిగా యష్ నటన బాగుంది. చివరి 20 నిమిషాల్లో రావణ్ గా యశ్ పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పించింది. రామాయణ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్. ఫస్టాఫ్‌లో విజువల్స్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నాయి. సెకండాఫ్ చాలా బాగుంది. ముఖ్యంగా రావణుడిగా యష్ లుక్స్, నటన అన్ని అమేజింగ్. రణ్‌బీర్, సాయిపల్లవి అద్బుతంగా ఉన్నారు అంటూ కొంతమంది ఆడియన్స్ ట్వీట్లు చేసారు.

రామయణం సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటన అవుట్‌స్టాండింగ్. రావణుడిగా యష్ కనిపించిన తీరు సూపర్బ్‌గా ఉంది.. అని మరికొందరు ట్వీట్లు వెయ్యగా.. రామాయణ ఓ చెత్త మూవీ, రాముడిగా రణ్‌బీర్ కానీ, సీత గా సాయి పల్లవి కానీ అస్సలు సూట్ కాలేదు, సోల్ లేని ఆత్మ రామాయణ, రామాయణ మనీ లాండరింగ్ డిజాస్టర్ అంటూ మరికొందరు ఆడియన్స్ రామాయణ పై స్పందిస్తున్నారు.

రామాయణ రాముడి సినిమా, కానీ ఈ బాలీవుడ్ రామాయణ యశ్ రావణ్ సినిమా... రాముడిగా రణ్‌బీర్ కన్నా యష్ రావణ్ గా అద్భుతంగా నటించారు, కనిపించారు, భారీ బడ్జెట్. గ్రాండ్ స్కేల్.. కానీ రామాయణ డిజప్పాయింట్ చేసింది అంటూ ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో రామాయణకు మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. మరి రామాయణ అసలు విషయం ఏమిటి అనేది పూర్తి సమీక్షలో మరికాసేపట్లో.. 

Ramayana Social Media Talk