ఆదర్శం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పోస్టర్
Aadarsha Kutumbam first weekend collections poster out
ఎప్పుడో రావాల్సిన ఆదర్శ కుటుంబం గత శుక్రవారం విడుదలైంది. త్రివిక్రమ్-వెంకటేష్ కలయికలో మొదటిసారి తెరకెక్కిన ఆదర్శ కుటుంబం చిత్రానికి మొదటిరోజు ఆడియన్స్ నుంచి అటు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. కాస్త ఫ్యామిలీస్ కి కనెక్ట్ కావడం, జైలర్ 2 తర్వాత మంచి సినిమా లేకపోవడం ఆదర్శ కుటుంబానికి అడ్వాంటేజ్ అయ్యింది.
వెంకీ కామెడీ, థమన్ BGM సినిమాకి హైలెట్ గా నిలవడం మొదటి వీకెండ్ లో ఆదర్శ కుటుంబం రూ.75 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్టుగా మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ వదిలారు. బ్లాక్ బస్టర్ ఆదర్శ కుటుంబం అంటూ మేకర్స్ వదిలిన పోస్టర్ చూసి పర్లేదు.. మిక్స్డ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అంటున్నారు.
మరి ఫ్యామిలీస్ ఆదర్శ కుటుంబాన్ని మెచ్చబట్టే ఈ కలెక్షన్స్ వచ్చాయని, లేదంటే ఈ టాక్ తో ఆదర్శ కుటుంబం బయ్యర్లు బాలయ్యేవారే అంటూ ఇండస్ట్రీ నుంచే వినిపిస్తున్న మాట.
















































