ఇక గురూజీ మనసంతా పాన్ ఇండియాపైనే!
Trivikram focus on Pan India Marketమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఆదర్శ కుటుంబం` విడుదల అవ్వడంతో? తదుపరి బిగ్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. ఇప్పటివరకు ప్రాంతీయ చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో తనదైన మార్కు చూపించిన గురూజీ ఈసారి శైలిని మార్చి పూర్తిస్థాయి పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి చిత్రం గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌తో లాక్ అయింది.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన `అరవింద సమేత వీర రాఘవ` ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి కలయికలో మరో సినిమా అనౌన్స్ అయినప్పటికీ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా మార్కెట్‌ను సైతం షేక్ చేసేలా పవర్ ఫుల్ వినూత్నమైన యాక్షన్ డ్రామా కథను త్రివిక్రమ్ సిద్ధం చేసారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి, త్రివిక్రమ్ మార్కు పెన్ను పవర్‌కి తగ్గట్టుగా విశ్వవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రిప్ట్‌ను మలుస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉండగా ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు కాస్టింగ్, టెక్నికల్ టీమ్‌ను సెట్ చేసే పనిలో పడ్డారు. `ఆదర్శ కుటుంబం` హడావుడి ముగియడంతో గురూజీ మనసంతా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
















































