బాలయ్యను కలిసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్

Blockbuster director meets BalayyaBlockbuster director meets Balayya


ఎక్కువగా యావరేజ్ హిట్స్ దగ్గరే ఆగిపోయిన దర్శకుడు శివ నిర్వాణ ఈ ఏడాది హీరో రవితేజ తో తెరకెక్కించిన ఇరుముడి చిత్రంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మారారు. ఇరుముడి చిత్రంతో రూ.200 కోట్ల క్లబ్బు డైరెక్టర్స్ సరసన చేరిన శివ నిర్వాణ తన నెక్స్ట్ మూవీ కోసం ఏ హీరో ని చూజ్ చేసుకుంటారో అనే విషయంలో చాలా ఆసక్తి కనిపిస్తుంది.

తాజాగా శివ నిర్వాణ నందమూరి బాలకృష్ణను కలిసి కథ వినిపించారనే టాక్ వినబడుతుంది. ప్రస్తుతం దాదా షూటింగ్  కోసం మైసూర్ లో ఉన్న బాలయ్య ను కలిసి షూటింగ్ బ్రేక్ లో శివ నిర్వాణ స్టోరీ లైన్ వినిపించారట. ఆ లైన్ బాలయ్యకు బాగా నచ్చేసింది అని తెలుస్తుంది.

బాలయ్య మైసూర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాక శివ నిర్వాణ మరోసారి బాలయ్యను కలిసి ఫుల్ నేరేషన్ ఇస్తారని.. బాలయ్య ఓకే చేస్తే.. కొరటాల శివ NBK 112 ప్రాజెక్ట్ తర్వాత శివ నిర్వాణ తోనే బాలయ్య తదుపరి మూవీ ఉండొచ్చని సమాచారం. 

Shiva Nirvana Meets Balakrishna In Mysuru