వెనక్కి తగ్గిన ‘గాడ్జిల్లా మైనస్ జీరో’?
Godzilla Minus 3 Japan release postponed?
జపాన్ - హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో విశేష ఆదరణ పొందిన `గాడ్జిల్లా మైనస్ జీరో` చిత్రం భారత్ లో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్‌ల కొరత కారణంగా జపనీస్ మాన్స్టర్ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం `రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్` కూడా అదే వారాంతంలో ఐమాక్స్ స్క్రీన్‌లలో విడుదలవడంతో ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్‌ల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. `రామాయణం` చిత్రానికి ఉన్న డిమాండ్ కారణంగా `గాడ్జిల్లా` సినిమాకు సరైన స్క్రీన్‌లు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ విడుదలైనా? కొన్ని ఐమాక్స్ థియేటర్లలో రోజుకు ఒక్క షో మాత్రమే లభించే అవకాశం ఉండేది.
దేశంలో చిత్ర పంపిణీని నిర్వహిస్తున్న పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మెరుగైన స్క్రీన్‌ల లభ్యత కోసం సినిమా విడుదలను కొత్త తేదీకి మార్చాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వాయిదాపై తేదీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ ప్రచారం నిజమైతే డిసెంబర్ రానున్న `అవెంజర్స్: డూమ్స్‌డే`, `డ్యూన్: పార్ట్ త్రీ` వంటి భారీ చిత్రాలతో పోటీ పడేందుకు తక్కువ సమయం ఉంటుంది.
















































