ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Is Prabhas repeating the Same Mistakes?

ప్రభాస్ ది అదే తప్పు.. ఫౌజీతోనైనా కళ్లు తెరుస్తారా?

Is Prabhas repeating the Same Mistakes?Is Prabhas repeating the Same Mistakes?

ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం. ఈ చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియాలోని చాలా భాషల ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. పాన్ ఇండియా మూవీస్ కి బలమైన పునాది వేశారు. ప్రభాస్ ఆ బాహుబలి క్రేజ్ ని మరో పెద్ద డైరెక్టర్ తో కంటిన్యూ చెయ్యకుండా రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ కి పాన్ ఇండియా ప్రాజెక్ట్ సాహో చేసే ఛాన్స్ ఇచ్చారు.

సాహో ని పాన్ ఇండియా లెవల్లో మ్యానేజ్ చెయ్యడంలో దర్శకుడు సుజిత్ కి అనుభవం సరిపోలేదు. ఆ చిత్రం నార్త్ కి కనెక్ట్ అయినా సౌత్ ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఆతర్వాత కూడా ప్రభాస్ ఏ బాలీవుడ్ డైరెక్టర్ నో, లేదంటే మరో స్టార్ డైరెక్టర్ నో చూజ్ చేసుకోకుండా ఒకటిరెండు సినిమాల అనుభవం ఉన్న రాధాకృష్ణ కు పాన్ ఇండియా ఛాన్స్ ఇచ్చారు. రాధేశ్యామ్ రిజల్ట్ ప్రభాస్ కి ఎంత పెద్ద షాక్ అనేది చెప్పాల్సిన పని లేదు.

ఇక ఓం రౌత్ ఆదిపురుష్ ని పక్కనపెడితే.. కేజిఎఫ్ తో ప్రభాస్ ప్రశాంత్ నీల్ ని ఎంచుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆతర్వాత నాగ్ అశ్విన్ తో కల్కి చేసారు, అది హిట్ అయ్యింది. కల్కి తర్వాత మళ్లీ చిన్న డైరెక్టర్ మారుతిని నమ్మి రాజాసాబ్ చేసారు. ఆ చిత్రము ప్రభాస్ ని తీవ్రంగా నిరాశపరిచింది.

ఇక ఇప్పుడు ఫౌజీ విషయంలో ఏం జరుగుతుందో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అర్ధమవుతుంది. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి కి ఫౌజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు ఆ విషయంలో టెన్షన్ తీసుకుంటున్నారనే న్యూస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఫౌజీ అవుట్ ఫుట్ విషయంలో ప్రభాస్ సంతృప్తిగా లేరు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బాహుబలి తర్వాత ప్రభాస్ ఒకటిరెండు సినిమాలు, చిన్న సినిమాలు చేసిన దర్శకులను నమ్మి ఛాన్స్ లు ఇచ్చి రిస్క్ తీసుకుంటున్నారనే అభిప్రాయాలు నెటిజెన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి ప్రభాస్ ఇప్పటికైనా ఫౌజీ రిజల్ట్ ని బట్టి రియలైజ్ అవుతారేమో అంటూ మాట్లాడుకోవడం గమనార్హం.

Prabhas-Fauzi