ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sukku and Charan disappoint for Dasara

దసరా కి డిజప్పాయింట్ చేసిన సుక్కు-చరణ్

Sukku and Charan disappoint for DasaraSukku and Charan disappoint for Dasara


రామ్ చరణ్-సుకుమార్ కలయికలో మొదలు కావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ RC 17 దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. పెద్ది షూటింగ్ సెట్ లో రామ్ చరణ్ మణికట్టు కు తగిలిన గాయం, తర్వాత సర్జరీ వలన RC 17 ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమైంది.

RC 17 దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో మొదలవుతుంది అని ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. అయితే దసరా కి RC 17 మొదలు కాకపోవడానికి కారణం ఏమిటి అంటే.. రామ్ చరణ్ ఇంకా సుకుమార్ లు RC 17 లొకేషన్స్ వేట కోసం యుకే వెళ్లడంతోనే ఈ పూజ పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తుంది.

సుకుమార్, రామ్ చరణ్ హైదరాబాద్ రాగానే RC 17 ప్రాజెక్ట్ కి పూజా కార్యక్రమాలతో మొదలు పెడతారని, అది కూడా అతి త్వరలోనే ఉంటుంది అని తెలుస్తుంది. ఈ చిత్రంలో చరణ్ కి జోడిగా బాలీవుడ్ క్యూటీ, ధురంధర్ భామ సారా అర్జున్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.

RC17 Grand Launch Soon