BB10: రోహిత్ పై యాక్షన్ తీసుకోమంటూ కంప్లైంట్స్
Bigg Boss 10: Complaints filed demanding action against Rohit
బిగ్ బాస్ సీజన్ 10 లో అగ్నిపరిక్ష 2లో చాలా అమాయకుడిగా కనిపించిన రోహిత్ బిగ్ బాస్ హౌస్ లో అసలు రంగు బయటపెడుతున్నాడు. అగ్నిపరీక్ష స్టేజ్ పై రోహిత్ ని అభిమానించినవారే ఇప్పుడు రోహిత్ ని విమర్శిస్తున్నారు. రోహిత్ షాలిని తో బాండింగ్ పెట్టుకుని ఆట చెడగొట్టుకున్నాడు, మాటలు తప్ప ఆట లేదు అంటూ విమర్శిస్తున్నారు.
ఇక వాష్ రూమ్ దగ్గర త్రిగుణ్ ని నోర్ముసుకో, గాడిద, వెధవ అంటూ నోరు పారేసుకున్న రోహిత్ ని హోస్ట్ నాగార్జున ఏమి అనలేదు. దానితో గత రాత్రి ఎపిసోడ్ లో నామినేషన్స్ లో దక్షి, ముఖేష్ ఇంకా త్రిగుణ్ పై రోహిత్ చేసిన కామెంట్స్ విషయంలో బుల్లితెర ఆడియన్స్ కూడా అంతే వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు.
రోహిత్ చేసిన బాడీ షేమింగ్, నోర్ముసుకో ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నేషనల్ టెలివిజన్ లో చోటు లేవని ఆడియన్స్ చాలామంది జియో గ్రివిఎన్స్ పోర్టల్ లో మరియు జియో కి మెయిల్స్ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
ముఖేష్ గౌడ్ కి ఫైల్స్ వచ్చినట్టుగా వెటకరంగా మాట్లాడం, అలాగే బాడీ షేమింగ్, దక్షిని బాడీలో స్టెబిలిటీ లేదు, ఊగుతూ మాట్లాడతావ్, త్రిగుణ ని చెంప పగలగొడతా, బయట దొరకవా, గేట్ దాటితే నువ్ నాకు దొరకవా అంటూ బెదిరించడంపై ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేస్తూ మెయిల్స్ పెట్టారు.
రోహిత్ కామెంట్స్ పై యాక్షన్ తీసుకోకపోతే ఇంకా పరదర్ గా యాక్షన్ తీసుకునేలా చేస్తామని ఆడియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మరోపక్క చాలామంది రోహిత్ రెడ్ కార్డు రావాలంటూ సోషల్ మీడియా X లో మినీ యుద్ధమే చేస్తున్నారు.
















































