హీరో చెబితే వింటారా?
Yash Request To Watch Ramayana Beyond VFX
ఈమధ్యన చాలా సినిమాలు వీఎఫ్‌ఎక్స్ విషయంలో ఆడియన్స్ చేతిలో ఏంతగా ట్రోల్ అయ్యాయో చూసాము. స్టోరీ, స్క్రీన్ ప్లే బావున్నా చాలా సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్ వీక్ అవడం ఆ సినిమాలకు మైనస్ అవుతుంది. అయితే రేపు దివాళి కి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న రామాయణ చిత్రానికి సంబందించిన రెండో ట్రైలర్ ఈ వీఎఫ్‌ఎక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంది.
రామాయణ చిత్రంలో రావణ్ గా విలన్ కేరెక్టర్ లో కనిపిస్తున్న హీరో యశ్ తాజాగా రామాయణ తెలుగు ఈవెంట్ లో రామాయణంలోని వీఎఫ్‌ఎక్స్‌లో చిన్న చిన్న లోపాలు వెతుకుతూ, చిత్ర బృహత్తర లక్ష్యాన్ని విస్మరించవద్దని యశ్ చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి భారీ చిత్రాలను నిర్మించేందుకు ముందుకొచ్చే నిర్మాతలను ప్రోత్సహించాలని కోరారు.
రామాయణ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ ఆడియన్స్ ఆదరించాలని, సినిమా నచ్చితే ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు రామాయణాన్ని పరిచయం చెయ్యాలని చెప్పారు. మరి యశ్ చెప్పింది బానే ఉంది. కానీ రామాయణ చిత్రం వీఎఫ్‌ఎక్స్ విషయంలో వీక్ అయితే యశ్ చెబితే ఆడియన్స్ వింటారా.. నిర్మొహమాటంగా విమర్శిస్తారు.
















































