జైలర్ -3 లో దిగాల్సింది వాళ్లే!
Jailer 3 Happening, But Who's The Main Man?
సూపర్ స్టార్ రజనీకాంత్- నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రిలీజ్ అయిన `జైలర్ 2` వెండితెరపై ఊహించని సంచలనాలను సృష్టిస్తోంది. ముఖ్యంగా పార్ట్-2లో హృతిక్ రోషన్‌ను క్యామియోగా .. అనిరుధ్ ఇచ్చే ఊరమాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను షేక్ చేసిన తీరు చూశాక `జైలర్ 3`పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల్సన్ రూపొందించిన ఈ సినిమా మల్టీస్టారర్ యూనివర్స్ సరిహద్దులను చెరిపేస్తూ గ్లోబల్ రేంజ్‌కి వెళ్తున్న వేళ మూడో భాగంలో ఎలాంటి దిగ్గజాలు దిగితే బాక్సాఫీస్ వద్ద నిజమైన సునామీ వస్తుందో అనే చర్చ సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.
మాలీవుడ్ నుంచి ఇప్పటికే మోహన్‌లాల్ రాగా `జైలర్ `లో మమ్ముట్టి ఎంట్రీ ఇస్తే ఆ గ్రేస్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడానికే రొమాంచితంగా ఉంది. ఇక బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ కనుక ముత్తువేల్ పాండియన్‌కి తోడుగా సెకండ్ హాఫ్‌లో అడుగుపెడితే? ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఇండియన్ క్రాస్‌ఓవర్‌గా నిలిచిపోతుంది. అటు నార్త్, ఇటు సౌత్ మార్కెట్లను ఏకకాలంలో శాసించేలా షారుఖ్ మార్క్ స్వాగ్, నెల్సన్ డాార్క్ కామెడీ అండ్ క్లాసిక్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడైతే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం.
ముఖ్యంగా టాలీవుడ్ నుంచి `నటసింహం` నందమూరి బాలకృష్ణ కనుక `జైలర్ 3`లోకి దిగితే ఆ ఊపు, మాస్ క్రేజ్ వేరే లెవెల్. మెగాస్టార్ చిరంజీవి క్లాస్ అండ్ డైనమిజం ఒకెత్తయితే.. విస్ఫోటనం లాంటి హై-వోల్టేజ్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీతో సీన్లను రచ్చరచ్చ చేయడం బాలయ్య శైలి. రజనీకాంత్-బాలకృష్ణ ఒకే ఫ్రేమ్‌లో నిలబడి గన్స్ పట్టుకుని అనిరుధ్ బీజీఎమ్‌కి స్లోమోషన్‌లో నడుస్తుంటే థియేటర్ల కప్పులు లేచిపోవడం ఖాయం. ఈ డ్రీమ్ కాంబినేషన్లతో నెల్సన్ గనక `జైలర్ 3` ప్లాన్ చేస్తే అది సినిమాగా మాత్రమే కాకుండా భారతీయ చిత్రసీమకే బిగ్గెస్ట్ మాస్ ఫెస్టివల్‌గా మారడం ఖాయం.
















































