సౌత్ లో ప్లాప్స్.. కానీ బాలీవుడ్ లో ఛాన్స్
Krithi Shetty to Enter Bollywood With New Love Story
సౌత్ లో అందులోను టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న కృతి శెట్టి కి ఆతర్వాత తెలుగులో ఒక్క హిట్ కూడా పడలేదు, ఆపై కోలీవుడ్ వెళ్ళింది. అక్కడైతే అమ్మడు కు హిట్ పక్కనపెడితే చాలా సినిమాలు విడుదల కానీ పరిస్థితి. అటు తమిళ్, ఇటు తెలుగు రెండుచోట్ల కృతి శెట్టికి నిరాశాజనకమైన ఫలితాలే కనిపించాయి.
అదే సమయంలో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పిలిచి ఛాన్స్ ఇచ్చారు. జనవరి 12 విడుదల చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తుంది. సౌత్ లో ప్లాప్స్ ఉన్నప్పటికీ.. కృతి శెట్టికి బాలీవుడ్ ఛాన్స్ రావడం హాట్ టాపిక్ అయ్యింది. కొద్దిరోజులుగా బాలీవుడ్ కి వెళుతుంది అన్నా కంఫర్మ్ న్యూస్ లేదు.
తాజాగా బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ రోహిత్ శెట్టి దగ్గర అసిస్టెంట్గా పని చేస్తున్న విధి ఘోడ్గావ్కర్ దర్శకురాలిగా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్న చిత్రంలో కృతి శెట్టి లీడ్ రోల్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ప్రేమ కథగా ఉండబోతుంది అని తెలుస్తుంది. మరి కృతి శెట్టి జోడిగా ఏ బాలీవుడ్ హీరో కనిపిస్తాడా అనేది సస్పెన్స్ గా మారింది.
















































