BB10: రోహిత్ - షాలిని వీళ్లు మారరు
Bigg Boss Warning to Rohit and Shalini
ఇంకేంటి రోహిత్, షాలిని విడిపోయారు, బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంట విడిపోయింది, షాలిని అలిగింది, రోహిత్ కి కోపమొచ్చింది అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో కాదు, బిగ్ బాస్ హౌస్ లోనే కనిపిస్తే.. ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయి మళ్లీ మళ్లీ గుసగుసలు స్టార్ట్ చేసి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేవరకు తెచ్చుకున్నారు.
కెప్టెన్ సుదీర్ వచ్చి ఐదు వార్నింగ్ లు వచ్చాయి, ఏంటబ్బా ఇది అని అడిగితే రోహిత్, షాలిని సిగ్గులేకుండా నవ్వడం చూసిన వారు మధ్యాన్నం బ్రేకప్, రాత్రికి స్టార్ట్ అప్ అంటూ కామెడీగా స్పందిస్తున్నారు. అయితే ఈవారం షాలిని వెళ్ళిపోతుంది అని ఆమెను కాపాడుకోవడానికే గొడవలు జరిగినట్టుగా నటిస్తున్నారు అంటూ బిగ్ బాస్ రివ్యూవర్స్ సోషల్ మీడియాలో ఏసుకుంటున్నారు.
రోహిత్ ఇచ్చిన పని చెయ్యడు, కానీ శాలినితో గంటలతరబడి మట్లాడుతూ టైమ్ గడిపేస్తాడు తప్ప పనే చెయ్యడు, సెలబ్రిటీస్ వచ్చి ఎవరి పని వారు చేస్తున్నా రోహిత్ మాత్రం పని చెయ్యడు. రోహిత్ తన గ్రాఫ్ తానే పడేసుకుంటున్నాడు, తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడంటూ రోహిత్ పై బిగ్ బాస్ రివ్యూవర్స్ కామెంట్లు పెడుతున్నారు.
















































