ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha Flaunts Baby Bump in New Photoshoot

సమంత ప్రెగ్నెన్సీ ఫోటో షూట్

Samantha Flaunts Baby Bump in New PhotoshootSamantha Flaunts Baby Bump in New Photoshoot


టాప్ హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. ప్రతి అమ్మాయి ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు హెల్దీ ఆహారం తీసుకుంటూ యోగ చేస్తూ విశ్రాంతి లో ఉంటుంది. సమంత మాత్రం హెల్దీ ఆహారంతో పాటుగా వర్కౌట్స్, యోగ చేస్తూనే భర్త రాజ్ నిడిమోరు తో కలిసి వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంది.

అంతేకాదు ఆమె చాలా యాక్టీవ్ గా ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్, అలాగే తమిళనాట కుకింగ్ షో కి హోస్ట్ గా మారిపోయింది. గత నెలలో అత్తారింట్లో సీమంతం చేసుకున్న సమంత ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతుంది. తాజాగా సమంత పలురకాల కాస్ట్యూమ్స్ అంటే శారీ , అలాగే మోడరన్ డ్రెస్ లతో చేయించుకున్న ఫొటోస్ షేర్ చేసింది.

కాస్త బబ్లీగా కనిపించినా.. సమంత మాత్రం ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోయింది. చీర కట్టులో సింపుల్ నెక్ సెట్ తో కనిపించగా, వైట్ డ్రెస్ లో హెవీ జ్యువలరీతో స్టయిల్ గా కనిపించింది. ప్రసుతం సమంత ఫోటో షూట్ ఫైనల్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. కారణం త్వరలోనే ఆమె డెలివరీ ఉండబోతుంది. 

Samantha Ruth Prabhu Flaunts Baby Bump in New Photoshoot