ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Teja’s Daughter Mokshadha Captures Public Attention

ర‌వితేజ వార‌సురాలు మ‌రో లోక‌!

Ravi Teja’s Daughter Mokshadha Captures Public AttentionRavi Teja’s Daughter Mokshadha Captures Public Attention

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించనున్న 78వ చిత్రానికి తులాభారం అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ హైదరాబాద్‌లో ఘనంగా టైటిల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు, టైటిల్ డాక్యుమెంటరీ విడుదల కార్యక్రమం సినీ వర్గాల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ వేడుకలో రవితేజ కుమార్తె మోక్షధ భూపతిరాజు ఎరుపు రంగు దుస్తుల్లో మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా.. ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్లు కూడా డిజైన‌ర్ దుస్తుల్లో కనిపించడం ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌గా.. మోక్ష‌ద త‌న యూనిక్ లుక్ తో ఈవెంట్ కే హైలైట్ గా నిలిచారు.

మోక్షద‌ భూపతిరాజు న‌ట‌న‌లోకి అడుగు పెడుతున్నారా? అంటూ అభిమానుల్లో ఈ సంద‌ర్భంగా చ‌ర్చ సాగింది. ఒక‌వేళ న‌టి అయితే ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ కుమార్తె క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ లా అజేయంగా రాణించే అవ‌కాశం ఉంద‌ని, మ‌రో లోక లాంటి చిత్రంతో మ్యాజిక్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌నే పాజిటివ్ వైబ్స్ త‌న చుట్టూ క‌నిపించాయి.

ఆస‌క్తిక‌రంగా మోక్షద ఇప్ప‌టికే సినీరంగంలో అనుభ‌వం ఘ‌డిస్తున్నారు. త‌న‌ విద్యాభ్యాసానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విద్యాపరంగా ఎంతో క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో తన చదువును పూర్తి చేశారు. రవితేజ- కళ్యాణి దంపతులు అందించిన సాంప్ర‌దాయం- విలువలతో కూడిన పెంపకంలో పెరిగిన మోక్షద‌ ప్రారంభం నుంచి చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మీడియా ప్రచారానికి దూరంగా ఉంటూ తన విద్యాభ్యాసాన్ని విజయవంతంగా ముగించిన ఈ యువ ప్ర‌తిభావ‌ని... చ‌దువు అనంతరం తన అభిరుచికి తగినట్లుగా సినిమా రంగం వైపు అడుగులు వేశారు.

సినీ పరిశ్రమలో మోక్ష‌ద‌ వృత్తిపరమైన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. సాధారణంగా స్టార్ హీరోల పిల్లలు నేరుగా నటనారంగంలోకి అడుగుపెట్టడానికి ఇష్టపడతారు.. కానీ మోక్షద‌ మాత్రం సినిమా మేకింగ్ లో ఉండే మెళ‌కువ‌లు, లోటుపాట్లను నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో దర్శకత్వ మెలకువలు నేర్చుకోవడంతో పాటు, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందారు. ముఖ్యంగా రవితేజ కెరీర్‌లో విజయం సాధించిన ఇరుముడి చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి, నిర్మాణ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షించారు.

కేవలం నిర్మాణ రంగానికే పరిమితం కాకుండా.. సినిమా వ్యాపార .. పంపిణీ రంగంలోనూ మోక్షద‌ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇరుముడి సినిమా విజయం తర్వాత నైజాం డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలను పరిశీలించడంతో పాటు.. బాక్సాఫీస్ లాభాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఒక యువ ప్రొడ్యూసర్‌గా, బిజినెస్ లీడర్‌గా ఆమె చూపుతున్న చొరవ టాలీవుడ్ వర్గాల్లో విశేష చర్చనీయాంశమైంది.

ఈ విధంగా చదువులో రాణించడంతో పాటు.. సినిమాల నిర్మాణంలో .. వ్యాపార విభాగాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మోక్షద‌.. తండ్రి ర‌వితేజ‌ తాజా చిత్రం తులాభారం టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో తన స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తండ్రి రవితేజ అడుగుజాడల్లో నడుస్తూనే... భవిష్యత్తులో టాలీవుడ్‌లో ఒక శక్తివంతమైన మహిళా నిర్మాతగా .. సినిమా వ్యాపారవేత్తగా ఎదగడానికి ఈ యువ ప్ర‌తిభావ‌ని వేస్తున్న అడుగులు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి. అయితే న‌టిగా న‌టి క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని సాధించిన విజ‌యాలు మోక్ష‌ద‌కు స్ఫూర్తిగా నిల‌వాల‌ని మాస్ రాజా అభిమానులు కోరుకుంటున్నారు.

Ravi Teja’s Daughter turns Centre of Attraction